Unlocking Divine Blessings: – శ్రీSri Shirdi Sai Baba Chalisa in Telugu షిరిడీసాయి చాలీసా
॥ Sri Shirdi Sai Baba Chalisa Telugu ॥
॥ శ్రీ షిరిడీసాయి చాలీసా ॥
షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి
దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా ॥ ౧ ॥
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
కఫిని వస్త్రము ధరియించి భుజముకు జోలీ తగిలించి
నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపుధారణలో
కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ వాసం భక్తుల మదిలో నీ రూపం ॥ ౨ ॥
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
చాంద్ పాటిల్ ను కలుసుకుని ఆతని బాధలు తెలుసుకుని
గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలములను
అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం ॥ ౩ ॥
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం ॥ ౪ ॥
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని
అభయమునిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ॥ ౫ ॥
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహామ్మారీ నాశం కాపాడి షిరిడీ గ్రామం
అగ్ని హోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలిగించి ॥ ౬ ॥
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
భక్త భీమాజీకి క్షయరోగం నశియించే ఆతని సహనం
ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి
దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం ॥ ౭ ॥
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
కరుణాసింధూ కరుణించు మాపై కరుణ కురిపించు
సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును
ముస్లిం అనుకొని నిను మేఘా తెలుసుకుని ఆతని బాధ
దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము ॥ ౮ ॥
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
డాక్టరుకు నీవు రామునిగా బల్వంతకు శ్రీదత్తునిగా
నిమోనుకరకు మారుతిగా చిదంబరకు శ్రీగణపతిగా
మార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగా జోషికి దర్శనము నిచ్చిన శ్రీసాయి ॥ ౯ ॥
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి ॥ ౧౦ ॥
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
అందరిలోన నీ రూపం నీ మహిమ అతి శక్తిమయం
ఓ సాయి మేము మూఢులము ఒసగుమయా మాకు జ్ఞానమును
సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము ॥ ౧౧ ॥
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయీ ధ్యానం చేయండి ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి
సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి ॥ ౧౨ ॥
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి సాయి మన సద్గురువండి ॥ ౧౩ ॥
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
వందనమయ్యా పరమేశా ఆపద్బాంధవ సాయీశా
మా పాపములూ కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరిచేర్చోయీ
మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం ॥ ౧౪ ॥
(షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం)
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ।
Kalabhairava Ashtakam in Telugu – కాలభైరవాష్టకం >>
In the realm of spiritual devotion, the chanting of Chalisa holds a sacred place, and when it comes to seeking the divine blessings of Sri Shirdi Sai Baba, the Sri Shirdi Sai Baba Chalisa in Telugu becomes a powerful tool for devotees. This timeless prayer encapsulates the essence of Sai Baba’s teachings and serves as a conduit for spiritual connection.
Understanding the Essence: Sri Shirdi Sai Baba Chalisa
The Sri Shirdi Sai Baba Chalisa is a devotional hymn consisting of forty verses, each crafted with profound love and reverence for the revered saint. These verses narrate the life, miracles, and teachings of Sai Baba, invoking his divine presence to guide and protect the devotees. Chanting the Chalisa is believed to bring peace, prosperity, and spiritual upliftment.
Connecting Through Language: శ్రీ షిరిడీసాయి చాలీసా
శ్రీ షిరిడీసాయి చాలీసా, or Sri Shirdi Sai Baba Chalisa in Telugu, beautifully captures the devotion and cultural richness of the Telugu-speaking community. The mellifluous Telugu language adds a layer of emotional resonance to the chanting, making the spiritual experience even more profound for those who seek solace in Sai Baba’s divine presence.
Embracing the Divine Vibration: Benefits of Chanting
Chanting the Sri Shirdi Sai Baba Chalisa is not merely a ritual; it is a spiritual journey. The vibrations created by the rhythmic recitation are believed to purify the mind and soul, fostering a deeper connection with the divine. Devotees often experience a sense of calmness, protection, and an overwhelming feeling of being guided by Sai Baba’s benevolent presence.
Sri Shirdi Sai Baba Chalisa in Telugu – శ్రీ షిరిడీసాయి చాలీసా PDF
For those who wish to carry the divine energy of Sri Shirdi Sai Baba Chalisa with them, a PDF version is available. This portable document ensures accessibility, allowing devotees to immerse themselves in the sacred verses anytime, anywhere. Download the Sri Shirdi Sai Baba Chalisa in Telugu PDF and let the divine blessings of Sai Baba illuminate your spiritual path.
In the symphony of devotion, the Sri Shirdi Sai Baba Chalisa in Telugu stands as a harmonious melody, inviting devotees to embark on a transformative journey towards spiritual enlightenment.
- Sri Lalitha Ashtottara Shatanamavali in Telugu – శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః - April 11, 2024
- Sri Durga Kavacham in Telugu – శ్రీ దుర్గా దేవి కవచం - April 10, 2024
- Shivananda Lahari in Telugu – శివానందలహరీ - April 9, 2024